Monday, April 29, 2024

పెళ్ళి ఎందుకు చేసుకోలేదో తెలియ‌దు కానీ.. పిల్లలు కావాలి.. రాహుల్ గాంధీ

తాను ఇప్ప‌టి వ‌ర‌కు పెళ్ళి ఎందుకు చేసుకోలేదో తెలియ‌దు కానీ పిల్ల‌లు మాత్రం కావాల‌ని ఉంద‌ని ఆస‌క్తిక‌ర‌వ్యాఖ్య‌లు చేశారు కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ. ఇటాలియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు.. తన అమ్మమ్మ పావ్‌లామాయినోకు తన సోదరి ప్రియాంక గాంధీ అంటే ఎంతో ఇష్టమని, ప్రాణప్రదంగా చూసుకుందని ఆయన అన్నారు.భారత్ జోడో యాత్ర సందర్భంగా గడ్డంతో కనిపించడంపైనా రాహుల్ స్పందించారు. యాత్ర పూర్తయ్యే వరకు గడ్డం తీయకూడదని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అయితే, ఇప్పుడా గడ్డాన్ని ఉంచాలా.. తీసేయాలా. అన్న విషయాన్ని ఇంకా నిర్ణయించుకోలేదని అన్నారు. ఇప్పటి వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదన్న ప్రశ్నకు రాహుల్ బదులిస్తూ.. ఎందుకన్న విషయం తెలియదని, కాకపోతే ఈ విషయం తనకే విచిత్రంగా ఉంటుందని అన్నారు. చాలా పనులు చేయాల్సి ఉందన్న ఆయన తనకు పిల్లలు కావాలని ఉందని మనసులో మాటను బయటపెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement