Monday, April 29, 2024

ఆర్టీఏలో ఘోరం.. మహిళా ఉద్యోగిని రేప్​ చేసి, ఫొటోలతో బెదిరిస్తున్న హోంగార్డు కటకటాల్లోకి

రీజనల్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ (ఆర్‌టీఏ)లో పనిచేస్తున్న ఓ హోంగార్డు.. అదే విభాగంలో తన సీనియర్‌ అయిన ఓ మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఆరోపణలతో జూబ్లీహిల్స్‌ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. తాను 2018లో హైదరాబాద్‌కు వచ్చానని, ఈ సిటీ కొత్త కావడంతో నిందితుడు స్వామి అనే వ్యక్తి పనుల్లో హెల్ప్​ చేసేవాడు. అతను సహాయం​ చేస్తున్నట్టు నటించి సన్నిహితంగా మెలిగేవాడు. ఒక రోజు తనకు కూల్​ డ్రింక్​లో మత్తుమందు కలిపి అందించాడు. అపస్మారక స్థితిలో ఉన్న తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

ఈక్రమంలోనే ఫొటోలు, వీడియోలు తీశాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని చెప్పి బ్లాక్‌మెయిల్ చేసినట్టు పోలీసులకు కంప్లెయింట్​ చేసింది. అంతేకాకుండా ఆ ఫొటోలు, వీడియోలను బయటపెట్టకుండా ఉండాలంటే రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు ఫిర్యాదులో పేర్కొంది.

ఇక.. బాధితురాలు ఈ మధ్యనే హైదరాబాద్ నుంచి బదిలీ కావడంతో.. అతని నంబర్‌ను బ్లాక్ చేసింది. దీంతో ఆమె తనకు కాంటాక్ట్​లో లేకుండా పోయిందన్న కోపంతో నిందితుడు స్వామి తను ట్రాన్స్​ఫర్​ అయిన చోటుకు వచ్చి ఆఫీసులో కనిపించాడు. ఆమె ఫొటోలను తన సహోద్యోగులకు షేర్​ చేస్తానని బెదిరించాడు. అప్పటి నుంచి వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. అంతేకాకుండా బాధితురాలి తల్లికి ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టాడు. ఎట్టకేలకు బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించగా.. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు స్వామిని అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement