Sunday, May 5, 2024

Breaking: హైద‌రాబాద్ ప్లాస్టిక్ స్క్రాప్‌ గోదాంలో భారీ అగ్నిప్ర‌మాదం.. ఎగిసిపడుతున్న మంటలు

హైద‌రాబాద్‌లోని ముషీరాబాద్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధి భోల‌క్‌పూర్ ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో శ‌నివారం సాయంత్రం భారీ అగ్నిప్ర‌మాదం జరిగింది. విద్యుదాఘాతంతో మంట‌లు అంటుకున్న‌ట్లు తెలుస్తోంది. చిన్న గల్లీలో ప్లాస్టిక్ స్క్రాప్ గోదాం ఉండడం. మంటలు అంటుకోవడంతో సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితులు తలెత్తినట్టు సమాచారం. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిప‌డుతున్నాయని స్థానికులు అంటున్నారు.

స్థానికుల సమాచారంతో అగ్నిమాప‌క సిబ్బంది సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజిన్ల‌తో అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను అదుపు చేస్తున్నారు. చుట్టుప‌క్క‌ల ఉన్న‌వారిని ఇల్లు ఖాళీ చేయిస్తున్నారు. గోదాంలో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ప్రాణ‌న‌ష్టం త‌ప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement