Wednesday, May 15, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు స్థిరంగా రూ.56,650 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో 24 క్యారెట్లకు చెందిన గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.61,800 వద్ద ఉంది. ఇక దేశ రాజధాని దిల్లీలో కూడా గోల్డ్ రేటు మండిపోతోంది. 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు దిల్లీలో రూ.56,800 వద్ద ఉండగా.. 24 క్యారెట్స్ గోల్డ్ రేటు 10 గ్రాములకు దేశ రాజధానిలో రూ.61,950 మార్కు వద్ద ఉంది. మరోవైపు ఇటీవల వరుసగా పడిపోయిన సిల్వర్ ధర ఇప్పుడు స్థిరంగా ఉంది. దిల్లీ మార్కెట్‌లో కిలో వెండి రేటు ప్రస్తుతం రూ.74,800 వద్ద ఉంది. ఇక హైదరాబాద్‌లో సిల్వర్ ధర రూ.78,500 మార్కు వద్ద కదలాడుతోంది. సాధారణంగా బంగారం, వెండి ధరలు ఆయా ప్రాంతాలను బట్టి.. అక్కడి పరిస్థితులను బట్టి హెచ్చుతగ్గులు ఉంటాయి. అంటే స్థానికంగా ఉండే పన్నులను బట్టి ధరలు మారుతుంటాయి. ఈ కారణంతోనే బంగారం ధర దిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో కాస్త తక్కువగా ఉంటుంది. అదే వెండి రేట్ల విషయానికి వస్తే హైదరాబాద్‌తో చూస్తే ఢిల్లీలో ధ‌ర‌లు కాస్త అందుబాటులో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement