Sunday, May 12, 2024

వీధి కుక్క .. ల‌క్కే ల‌క్కు – ఏకంగా ర‌త‌న్ టాటా ప‌క్క సీట్ లోనే కూర్చుంటుంద‌ట‌

ర‌త‌న్ టాటా పేరు తెలియ‌ని వారు ఉండరేమో..టాటా గ్రూప్ చైర్మ‌న్ గానే కాకుండా విరాళాలు ఇవ్వ‌డం, సామాజిక సేవ చేయ‌డంలో కూడా ఆయ‌న పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తుంటుంది. ఇండియాలో అత్యంత ధ‌న‌వంతుల్లో ఈయ‌న కూడా ఒక‌ర‌న్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌నకి పెంపుడు జంతువులంటే మ‌హా మ‌క్కువ‌ట‌. శున‌కాల‌పై అమిత‌మైన ప్రేమ‌ని కురిపిస్తార‌ట‌. అంతేకాదండోయ్ బొంబాయిలోని టాటా గ్రూప్ ప్ర‌ధాన కార్యాల‌యంలో కుక్క‌ల కోస‌మే ఖ‌రీదైన భ‌వ‌నాన్ని నిర్మించార‌ట‌.
ఇక్కడి వీధి కుక్కలు చాలా కాలం నుండి బొంబాయి హౌస్ లో నివసిస్తున్నాయి. కాగా.. వాటిల్లో ఓ వీధి కుక్క‌ కూడా చాలా స్పెషల్ తెలుసా. ఆ వీధి కుక్క… రతన్ టాటాతో పాటు ఆఫీసుకు కూడా వస్తుంది. పక్క సీట్లో లో కూడా కూర్చుంటుంద‌ట‌. ఆయనతోపాటు ఆ కుక్క మీటింగ్స్ కి హాజరౌతుండ‌టం విశేషం. ఇటీవల ఓ మహిళ .. రతన్ టాటాని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లగా.. ఈ కుక్క గురించి తెలిసింది. సదరు కుక్క పేరు గోవా. అది కూడా.. టాటా ఏది చెబితే అది వింటుందట. ఇంటర్వ్యూ తర్వాత.. ఆమె.. ఈ శునకం గురించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది వైరల్ గా మారింది.

హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ వ్యవస్థాపకురాలు కరిష్మా మెహతా షేర్ చేసిన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో తాను రతన్ టాటాను మొదటిసారి కలిసినప్పుడు.. గోవా అనే కుక్క ఆయన పక్కనే కూర్చొని ఉందని చెప్పారు…”నేను మిస్టర్ టాటా కార్యాలయం వెలుపల వేచి ఉండగా, అతని ప్రక్కన ఉన్న కుర్చీలో ఒక కుక్క సౌకర్యవంతంగా ఉంచి ఉండటం గమనించాను” అని Ms మెహతా రాశారు. తనకు కుక్కలంటే భయమని.. చాలా సేపు ఇంటర్వ్యూ చేయడానికి కూడా సంకోచించినట్లు ఆమె చెప్పారు. అయితే.. టాటా.. సదరు కుక్కతో.. మనిషితో మాట్లాడినట్లు ఆమె నీకు భయపడుతోంది. దగ్గరకు వెళ్లొద్దు అని చెప్పారట. అది కూడా.. ఇంటర్వ్యూ దాదాపు 40 నిమిషాలపాటు సాగినా.. ఆమె వద్దకు వెళ్లకుండా అక్కడే ఉందట. ఈ విషయం తనను చాలా ఆశ్చర్యానికి గురిచేసిందని ఆమె వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఈ వార్త సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. ధ‌న‌వంతులు సాధార‌ణంగా అతి ఖ‌రీదైన కుక్క‌ల‌ని పెంచుకోవ‌డం ప‌రిపాటే. కానీ వీధి కుక్క‌ని ర‌త‌న్ టాటా లాంటి వ్య‌క్తి చేర‌దీయ‌డ‌మే కాకుండా ..అంత‌టి ప్రాధాన్య‌త‌ని ఇవ్వ‌డం ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement