Sunday, May 19, 2024

పాపువా న్యూ గినియాలో భారీ భూకంపం.. తీవ్రత 7.0

పాపువా న్యూ గినియా దేశంలో ఈరోజు తెల్లవారుజామున 4గంటలకు భారీ భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం.. ఈ వేకువ ఝామున 4 గంటల సమయంలో రిక్టర్‌ స్కేల్‌పై 7.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. సముద్ర తీరంలోని వెవాక్‌ పట్టణానికి 97 కిలోమీటర్ల దూరంలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే (USGS) వెల్లడించింది. భూఅంతర్భాగంలో 62 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని యూఎస్ జీఎస్ పేర్కొంది.

భారీ భూకంపం సంభవించినప్పటికీ సునామీ వచ్చే ప్రమాదమేమీ లేదని వెల్లడించింది. భూకంప సంభవించిన ప్రాంతంలో పెద్దఎత్తున నష్టం వాటిల్లినట్లు తెలిపింది. భూకంపం సంభవించిన ప్రాంతం ఇండోనేషియా సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉందని వివరించింది. భూకంప జోన్ లో మొత్తని నేల వల్ల నష్టం కలిగే అవకాశముందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి సునామీ హెచ్చరిక జారీ చేయలేదని అధికారులు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement