Friday, May 17, 2024

యూట్యూబ్ ఛాన‌ల్ స్టార్ట్ చేసిన హీరోయిన్ ‘ర‌ష్మిక మంద‌న‌’

హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక మందన తాజాగా మరో బిజినెస్ మొదలు పెట్టింది. యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించింది హీరోయిన్ రష్మిక. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా రష్మిక ప్రకటన చేసింది. తన యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అంటూ ఓ వీడియోను కూడా తన ట్విట్టర్ వేదికగా విడుదల చేసింది ఈ బ్యూటీ. రష్మిక మందన ఇతర సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఇక రష్మిక చెప్పడంతోనే ఆమె ఫ్యాన్స్… యూట్యూబ్ ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేస్తున్నారు. తామే ముందు subscribe చేశామంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు నెటిజన్లు.

Advertisement

తాజా వార్తలు

Advertisement