Thursday, May 2, 2024

హంసానందినికి అమీ ప‌టేల్ స‌పోర్ట్ – త్వ‌ర‌గా కోలుకోవాల‌ని పోస్ట్

హీరోయిన్ గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా, ఐటెం సాంగ్స్ లో కూడా మెరిసింది హంసానందిని. ఈ బ్యూటీ బ్రెస్ట్ క్యాన్స‌ర్ బారిన ప‌డింది. తాను గ్రేడ్3 క్యాన్సర్‏తో పోరాడుతున్నట్టు హంసానందిని తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలియజేసింది. ప్రస్తుతం ఆమెకు కీమోథెరపీ జరుగుతుంది. ఇదిలా ఉంటే.. ఓవైపు చికిత్స తీసుకుంటునే ఫోటో షూట్ చేసింది హంసానందిని. గుండుతో ఉన్న ఈ ఫోటోలలో హంసానందిని ముఖంలో కొన్ని భావాలు కనిపించాయని ఆమెకు స్టైయిలిస్ట్‏గా చేసిన అమీ పటేల్ అన్నారు.

తాజాగా హంసానందిని ఫోటో షేర్ చేస్తూ ఆమె చాలా అందంగా కనబడుతున్నారని తెలిపింది. “మీ ఫోటో.. బలం, నమ్మకం, అందాన్ని ఆవిష్కరిస్తోంది. ఇప్పుడు క్యాన్సర్ తో మీరు చేస్తున్న యుద్ధం మీ జీవిత ప్రయాణంలో ఒక భాగం మాత్రమే. మీరు దీన్నుంచి విజయవంతంగా.. మరింత అందంగా బయటకు వస్తారు. మేమంతా మీ వెంటే ఉంటాం ” అంటూ అమీ పటేల్ తెలిపింది.హంసానందినికి అందం, అభినయం కలగలిపి ఉన్నప్పటికీ హీరోయిన్‏గా అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది. అయితే పలు చిత్రాల్లో కీలక పాత్రలలో.. స్పెషల్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరైంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement