Saturday, May 4, 2024

మాస్ మ‌హరాజ్ ర‌వితేజ బ‌ర్త్ డే – ప‌లు చిత్రాల పోస్ట‌ర్స్ రిలీజ్

మాస్ కి నిర్వ‌చ‌నంలా అనిపిస్తాడు అత‌డిని చూస్తే, కేవ‌లం మాసే కాదు కామెడీని పండించ‌డంలో మహాదిట్ట‌. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు నుండి మాస్ మ‌హారాజ్ వ‌ర‌కు ఆయ‌న ఎదిగిన తీరు అంద‌రికీ తెలిసిందే. ఆయ‌నే హీరో ర‌వితేజ‌. నేడు ఆయ‌న పుట్టిన‌రోజు. ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వ‌చ్చి , స్వ‌యం కృషితో అంచెలంచెలుగా ఎదిగాడు ర‌వితేజ‌. త‌న‌దైన మేన‌రిజ‌మ్స్ తో మెగాస్టార్ చిరంజీవి నుండి ప్ర‌శంస‌లు అందుకున్నాడు. ఇక నంద‌మూరి బాల‌కృష్ణ‌తో కూడా సెభాష్ అనిపించుకున్నాడీ మాస్ హీరో. ఇక ఈ హీరో బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న ఏడాది న‌టిస్తున్న ప‌లు చిత్రాల పోస్ట‌ర్ల‌ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్ వారు.
రవితేజ ఈ ఏడాది వరుసగా థియేటర్లలో తన సినిమాలు దింపేయడానికి రెడీ అవుతున్నాడు. ‘ఖిలాడి’ .. ‘రామారావు ఆన్ డ్యూటీ’ .. ‘ధమాకా’ .. ‘రావణాసుర’ .. ‘టైగర్ నాగేశ్వరావు’ సినిమాలు లైన్లో ఉన్నాయి. ఈ రోజున రవితేజ పుట్టినరోజు కావడంతో ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ సినిమాలకి సంబంధించిన కొత్త పోస్టర్స్ ను రిలీజ్ చేస్తున్నారు.

రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ‘ఖిలాడి’ సినిమా వచ్చేనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మీనాక్షి చౌదరి .. డింపుల్ హయతి ఆయన సరసన అందాల సందడి చేయనున్నారు. ఆ తరువాత సినిమాగా ఆయన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రానున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా దివ్యాన్ష కౌశిక్ అలరించనుంది.ఇక నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ‘ధమాకా’ను కూడా రవితేజ సెట్స్ పైకి తీసుకుని వెళ్లాడు. అలాగే సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ సినిమా పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేశాడు. త్వరలో ‘టైగర్ నాగేశ్వరావు’ కూడా పట్టాలెక్కనుంది. ర‌వితేజ మ‌రిన్ని చిత్రాల్లో న‌టించాల‌ని కోరుతూ..ఆయ‌న‌కి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తోంది ఆంధ్ర‌ప్ర‌భ‌.

https://www.youtube.com/watch?v=RAb1HV4ZC-E

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement