Friday, May 10, 2024

రానా బ‌ర్త్ డే : ‘ర‌వ‌న్న’ పేరుతో స్పెష‌ల్ వీడియో

రానా త‌న మొద‌టిసినిమా నుండి వైవిధ్య‌మైన చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నాడు. లీడ‌ర్ లో యంగ్ సీఎంగా న‌టించి మంచి మార్కులు కొట్టేశాడు. ఇప్పుడు ప్రేక్ష‌కుల ముందుకు ర‌వ‌న్న‌గా రానున్నాడు.దర్శ‌కుడు వేణు ఊడుగుల తెర‌కెక్కిస్తున్న చిత్రం విరాట‌ప‌ర్వం. ఈ చిత్రంలో హీరో రానా, హీరోయిన్ సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించారు. నేడు రానా పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా విరాట‌ప‌ర్వం నుంచి వాయిస్ ఆఫ్ ర‌వ‌న్న పేరుతో స్పెష‌ల్ వీడియోని రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ చిత్రంలో రానా కామ్రేడ్ ‘రవన్న’గా కనిపించనున్నాడు.

ఆయన భావావేశమే ‘ది వాయిస్ ఆఫ్ రవన్న’ పేరుతో రిలీజ్ చేశారు.”మారదులే ఈ దోపిడీ దొంగల రాజ్యం మారదులే” అంటూ ఈ వీడియో మొదలయింది. “చీకటి మింగిన సూర్యుడిని తెచ్చి తూరుపు కొండని వెలిగిద్దాం” అంటూ ఉద్యమం దిశగా అడుగులు వేయించడానికి ఆయన చేసిన ప్రయత్నం కనిపిస్తోంది. ఆయన పిలుపును అందుకున్నట్టుగా సాయిపల్లవి ఒంటరిగా ఆవేశంతో బయల్దేరినట్టుగా కనిపిస్తోంది. తూటాల్లాంటి మాటలతో పాటు .. తూటాల శబ్దాల మధ్య ఈ వీడియో సాగింది. ఆవేశంతో పాటు అందమైన ప్రేమకథ కూడా ఉందనే విషయాన్ని చెప్పారు. సంక్రాంతికి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్న‌ట్టు తెలిపారు. సురేశ్ బాబు – సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా, నక్సలిజం నేపథ్యంలో నడుస్తుంది.

https://www.youtube.com/watch?v=Kuw9mLEQqrQ

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement