Sunday, June 23, 2024

కేదార్ నాథ్.. గంగోత్రి ఆల‌యాల‌ను క‌ప్పేసిన మంచు దుప్ప‌టి

ఉత్త‌రాఖండ్ లోని ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రాలు కేదార్ నాథ్..గంగోత్రి ఆల‌యాల‌ను మంచు దుప్ప‌టి క‌ప్పేసింది.ఆలయ పరిసరాల్లో కనుచూపుమేర హిమపాతం పరుచుకుంది. చమోలీ జిల్లాలోని పలు ప్రాంతాలు మంచు గుప్పిట్లో చిక్కుకున్నాయి. జోషీమఠ్‌ తదితర ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది.హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ ఉష్ణోగ్రతలు భారీగా పతనమవుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో మంచు దట్టంగా కురుస్తోంది. ఇండ్లను, రోడ్లను పూర్తిగా మంచు కప్పేసింది. సిమ్లా, మనాలీలోని పలు ప్రాంతాల్లో శ్వేత వర్షం అలుముకొంది. రహదారులపై ఎక్కడ చూసినా హిమపాతం పేరుకుపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాలను మంచుదుప్పటి కప్పేసింది. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement