Saturday, May 4, 2024

హైద‌రాబాద్ లో మొండెం లేని మహిళ తల లభ్యం

హైద‌రాబాద్ లోని మలక్‌పేట తీగలగూడ వద్ద మొండెం లేని మహిళ తల కలకలం రేపుతుంది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళను ఎక్కడో హత్య చేసి కవర్ లో తలను మూసీ సమీపంలో తీగలగూడ వద్ద వదిలివేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.

మహిళ మొండెం ఎక్కడ ఉందనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మహిళ ఎవరనే విషయమై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మరో వైపు మొండెం లేని తల మహిళను హత్య చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ మహిళను హత్య చేసిన దుండగుల కోసం దర్యాప్తును ప్రారంభించారు. సంఘటన స్థలంలో పోలీసులు క్లూస్ సేకరిస్తున్నారు. ఈ ప్రాంతంలోని సీసీటీవీ పుటేజీని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement