Tuesday, May 7, 2024

వీడు మామూలోడు కాదు.. జిమ్నాస్టిక్స్​లో టాప్​ లెవల్​.. ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్‌

ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. ఆయన తన పనిలో బిజిగా ఉంటునే, సోషల్ మీడియాలో మోటివేషన్ వీడియోలు, స్పూర్తీని కల్గించే అంశాలను పోస్ట్ చేస్తుంటారు. దీన్ని చూడటానికి నెటిజన్లు కూడా ఇంట్రెస్ట్ చూపుతుంటారు. ప్రస్తుతం ఒక వీడియోను ఆయన తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది తెగ వైరల్ అవుతోంది. అందరిని ఆలోచింప చేస్తోంది కూడా..
ఒక యువకుడు గ్రామంలో ఇరుకైన రోడ్డుపై సైకిల్ నడిపిస్తున్నాడు. అతను తలపై బట్టల మూట పెట్టుకుని, హ్యాండిల్ వదిలేశాడు. రోడ్డుపై బ్యాలెన్స్ చేసుకుంటూ సైకిల్ నడిపిస్తున్నాడు. రోడ్డు వంకర టింకరలుగా ఉంది. అయినా.. అతను ఏ మాత్రం కంట్రోల్ తప్పకుండా వెళ్తున్నాడు. అతను జైరో స్కోప్ మాదిరిగా అన్ని దిశల్లో ప్రయాణిస్తున్నాడు. ఈ బాలుడిని ఆ మార్గంలో వెళ్లే వారు వింతగా చూస్తున్నారు. ఈ వీడియోను బాలుడు వెనకాల నుంచి కారులో ఉన్న ఒక వ్యక్తి వీడియో తీశాడు. ఆ తర్వాత ఇది వెలుగులోనికి వచ్చింది. ఈ వీడియోను ట్వీట్ చేసిన ఆనంద్ మ‌హీంద్రా.. ఇత‌ని బాడీలో గైరోస్కోప్ ఏమైనా ఉందేంటి ఇట్లా ఉన్నాడు అంటూ ట్వీట్ చేయ‌డం ఆస‌క్తిగా మారింది.. అంతేకాకుండా దేశంలో ఇట్లాంటి ప్ర‌తిభ గ‌ల వ్య‌క్తులు ఎంతో మంది ఉన్నార‌ని, వారికి స‌రైన ప్రోత్సాహం ల‌భించ‌డం లేద‌ని పేర్కొన్నారు. అందుకే ఇంకా క‌ష్టాలు ఎదుర్కొంటూ ఇలా నెట్టుకొస్తున్నార‌ని ఆనంద్ మ‌హీంద్రా త‌న ట్వీట్‌లో తెలిపారు.. మీరు ఈ వీడియూ చూసి ఆ యువ‌కుడి ప్ర‌తిభ‌కు ఓ లైక్ కొట్టేయండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement