Friday, May 3, 2024

ఈటలకు ఝలక్: హుజురాబాద్ పై హరీష్ కొత్త స్కెచ్!

తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారుతునున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గం అయిన హుజరాబాద్ కేంద్రంగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. హుజురాబాద్ లో ఈటలను బలహీన పరిచేందుకు ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ పావులు కదిపింది. ఇప్పటికే ఈటలను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన కేసీఆర్… ఆయన రాజకీయ పునాదులను కూడా కదిలించేందుకు శరవేగంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఆపార్టీ  ట్రబుల్ షూటర్‌గా పెరున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావును రంగంలో దిపింది. ఆపరేషన్ హుజురాబాద్‌ను ప్రారంభించింది. నియోజకవర్గ టీఆర్ఎస్ నేతలెవరూ ఈటెల వెంట వెళ్లకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో శనివారం మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ లతో కమలాపూర్ మండల నాయకుల భేటీ అయ్యారు.

 టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తామని..క్యాడర్ అంతా టీఆర్ఎస్ తోనే ఉన్నారని హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండల ప్రజాప్రతినిధుల స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇతర ఎలాంటి ఆలోచనలకు తావు లేదని, తామంతా టీఆర్ఎస్ తోనే ఉన్నామని స్పష్టం చేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు విజయవంతంగా సాగడానికి, నియోజకవర్గ ప్రజలకు మేలు జరగడానికి టీఆర్ఎస్ జెండా నీడలోనే సాధ్యమని వెల్లడించారు. 2001 నుంచి టీఆర్ఎస్‌తోనే నడిచామని.. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ వెంటే ఉంటామని తెలిపారు.

ఈటల రాజీనామాతో జరిగే హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఈటలను ఓడించి.. సత్తా చాటాలని టీఆర్ఎస్ ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఉమ్మడి కరీంనగర్‌పై మంచి పట్టున్న ఈటల రాజేందర్‌ను కట్టడి చేసే బాధ్యలను ఇటీవల మంత్రి గంగులకు అప్పగించింది. అయితే, ఆశించిన మేరకు గంగుల తన బాధ్యతలను నిర్వహించలేకపోయారు. గంగులను టార్గెట్ చేస్తూ ఈటల తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించడంతో కేసీఆర్ వ్యూహం మార్చారు. పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన హరీష్ రావును రంగంలో దించారు. కేసీఆర్ సూచనలతో హరీష్ రావు.. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. 

మరోవైపు ఈటల రాజేందర్ బీసీ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఆత్మగౌవరం అనే నినాదంతో పార్టీ నుంచి బయటికొచ్చారు. ఇతర పార్టీల నేతలతోనూ వరుసగా భేటీ అవుతూ మద్దతు కూడగట్టుతున్నారు. ముదిరాజ్ సామాజికవర్గం కూడా ఆయన వెంటనే ఉందన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈటలను ఎదుర్కొనేందుకు ట్రబుల్ షూటర్ హరీష్ రావును రంగంలోకి దింపారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంక్లిష్టమైన పరిస్థితుల్లో కూడా పలువురు టీఆర్ఎస్ నేతలను గెలిపించిన సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డ్ హరీశ్ కు ఉంది. మరోవైపు, హరీష్ కు, ఈటలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. హరీష్ వర్గ నేతగా ఈటలకు గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో ఈటలను దెబ్బతీసేందుకు హరీష్ ను సీఎం కేసీఆర్ రంగంలోకి దించడం ఆసక్తికరంగా మారింది. 




ఇదీ చదవండి: కరోనా టెస్టింగ్ కిట్ రూపొందించిన డీఆర్డీవో

Advertisement

తాజా వార్తలు

Advertisement