Saturday, May 4, 2024

5 కోట్ల విలువైన వాచ్ లు సీజ్.. హార్ధిక్ పాండ్యా ఏమన్నాడంటే..

టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా వద్ద ఉన్న రూ. 5 కోట్ల విలువ చేసే రెండు వాచ్ లను ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఈ ఏడాది ఐపీఎల్ లోని రెండవ భాగం యూఏఈ వేదికగా జరిగిన విషయం తెలిసిందే. ఆ లీగ్ కోసం అక్కడికి వెళ్లిన పాండ్యా ఆ తర్వాత ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కోసం అక్కడే ఉండిపోయాడు. టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియా ఆటగాళ్లు ఒక్కొక్కరుగా ఇండియాకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో దుబాయ్ నుంచి ముంబైకి వచ్చిన హార్ధిక్ పాండ్యా వద్ద  5 కోట్ల విలువ చేసే రెండు వాచ్ లు గుర్తించిన కస్టమ్స్ అధికారులు వాటిని సీజ్ చేసారు.

కాగా, గతంలో హార్ధిక్ అన్న కృనాల్ పాండ్యాకు కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. గత ఏడాది ఐపీఎల్ తర్వాత దుబాయ్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన కృనాల్ వద్ద కస్టమ్స్ అధికారులు బంగారాన్ని గుర్తించారు. అయితే బంగారాన్ని సీజ్ చేసిన అధికారులు కృనాల్ ను మాత్రం విడిచిపెట్టారు.

అయితే, దీని పైన పాండ్యా ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు. దుబాయ్ నుండి తెచ్చిన వస్తువులను… తానే స్వయంగా కస్టమ్స్ అధికారుల వద్దకు తీసుకెళ్లానని… దానికి అవసరమైన మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు కస్టమ్స్ కౌంటర్‌ కు వెళ్లి చెప్పినట్లు పాండ్యా తెలిపాడు. అయితే తాను తెచ్చిన వాచ్ ల విలువ 5 కాదు.. కేవలం 1.5 కోట్ల మాత్రమే అని స్పష్టం చేశాడు. వాటిని కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ సరైన వాల్యుయేషన్ కోసం మాత్రమే తీసుకుందని హార్దిక్ వివరించారు. అలాగే వీటికి కావాల్సిన చట్టబద్ధమైన పత్రాలను వారికి అందజేస్తాను తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమైనవి అని చెప్పిన పాండ్యా.. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మోద్దని కోరాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement