Monday, April 29, 2024

అర గంట ఆలస్యంగా గణతంత్ర వేడుకల ప్రారంభం.. పొగ మంచే కారణమని వెల్లడి

న్యూఢిల్లి: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. కేంద్ర ప్రభుతం భారీ ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే రాజ్‌పథ్‌ చుట్టుపక్క ప్రాంతమంతా.. భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. 23 నుంచి గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభం అవుతాయి. సుమారు 1000 డ్రోన్లు, 75 మిలటరీ ఎయిర్‌ క్రాఫ్ట్‌లు, 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన శకటాలు, తొమ్మిది మంది కేంద్ర మంత్రులు రాజ్‌పథ్‌లో నిర్వహించే ఈ వేడుకల్లో పాల్గొంటారు. ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు చేసింది. 23 నుంచి 30 వరకు గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. జనవరి 26న 30 నిమిషాలు ఆలస్యంగా ప్రధాన కార్యక్రమం ప్రారంభం అవుతుంది. అయితే కరోనా కారణంగా ఈసారి కూడా ముఖ్య అతిథులు లేకుండానే.. వేడుకలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడూ కూడా 10.00 గంటలకు కార్యక్రమం ప్రారంభం అవుతుంది. కానీ ఈ సారి 10.30 గంటలకు ప్రారంభం అవుతాయి.

పొగ మంచుతో పాటు కాలుష్య ప్రభావం ఉండనున్న నేపథ్యంలో.. అరగంట ఆలస్యంగా ఈ కార్యక్రమం ప్రారంభిస్తారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతి సందర్భంగా వేడుకలు 23నుంచి ప్రారంభమై.. అమర వీరుల దినోత్సవం అయిన జనవరి 30తో ముగుస్తాయి. కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా కార్యక్రమం ఉంటుంది. రిపబ్లిక్‌ పరేడ్‌లో కూడా పరిమిత సంఖ్యలో సందర్శకుల అనుమతి ఉంటుంది. గతేడాది కరోనా తగ్గుముఖం పట్టడంతో.. 25,000 మందికి అనుమతి ఇచ్చారు. అయితే ఈసారి ఈ సంఖ్యను భారీగా తగ్గించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తున్నది. కేవలం 5000 నుంచి 8000 మందికి మాత్రమే గణతంత్ర దినోత్సవ వేడుకలు చూసేందుకు అనుమతి ఇవాలని నిర్ణయించినట్టు సమాచారం. హైబ్రిడ్‌ మోడ్‌పై కేంద్రం దృష్టి సారించింది. ప్రత్యక్షంగా కాకుండా.. టీవీల్లో లైవ్‌గా చూసేందుకు మొగ్గు చూపాలని సూచిస్తున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement