Thursday, May 2, 2024

TS | గురుకుల మ్యూజిక్‌ టీచర్స్‌ పూర్తి నోటిఫికేషన్‌.. మే 25 వరకు దరఖాస్తులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాల్లోని ఖాళీగా ఉన్న 123 మ్యూజిక్‌ పోస్టులకు గురుకుల బోర్డు నోటిఫికేషన్‌ జారీ చేసింది. గతంలోనే ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌ ప్రకటించినప్పటికీ ఈమేరకు బుధవారం డిటైల్డ్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అయితే 123 పోస్టుల్లో 119 పోస్టులు మహిళా అభ్యర్థులకు రిజర్వు కానున్నాయి.

మరో నాలుగు పోస్టులు జనరల్‌ కోటాకు కేటాయించారు. ఈనెల 26 నుంచే దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించేయగా మే 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుకు తుది గడువిచ్చారు. పరీక్ష తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో పరీక్షను నిర్వహించనున్నట్లు బోర్డు అధికారులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement