Thursday, May 2, 2024

ఆక‌ట్టుకుంటోన్న ‘గుర్తుందా శీతాకాలం’ ట్రైల‌ర్

స‌త్య‌దేవ్ హీరోగా తెర‌కెక్కిన చిత్రం గుర్తుందా శీతాకాలం. ప్రేమికుల దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ చిత్ర ట్రైల‌ర్ ని రిలీజ్ చేశారు. రెండు నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ .. మంచి ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీలా అనిపిస్తోంది. ట్రైలర్‌లో వచ్చే ప్రతీ డైలాగ్‌ మనసును తట్టిలేపుతోంది. కెరీర్‌లో కోమలి, అమ్ము, దివ్య, నిధి ఇలా నలుగురిని ప్రేమించిన హీరో చివరికి తన పాట్నర్‌గా ఎవరిని ఎంచుకున్నాడు అన్న కథను దర్శకుడు ఎంతో సెన్సిటివ్‌గా తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. ట్రైలర్‌లో వచ్చే..
శీతాకాలం.. మంచులో మనసులు తడిసి ముద్దయ్యే కాలం.. చల్లగాలికి పిల్లగాలి తోడయ్యే వెచ్చనికాలం..’, ‘మనసుతో ప్రేమించాలంటే, ముందు కళ్లతో చూడాలి కదా’ అలాంటి డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. నాగశేఖర్‌ దర్శకత్వం వహించన సినిమాలో సత్యదేవ్‌ సరసన మేఘా ఆకాశ్‌, కావ్యాశెట్టి, తమన్నలు నటించారు. మరి ఈ అందమైన ప్రేమ కథతో కూడిన ట్రైలర్‌ను మీరూ చూసేయండి.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement