Wednesday, May 15, 2024

ఓఆర్‌ఆర్‌పై గ్రీన్‌ డ్రైవింగ్‌, ఫలించిన హరితహారం.. హెచ్‌ఎండీఏ కృషితో పచ్చటి శోభ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్‌ మెట్రో డెవలప్‌మెంట్‌ అథారిటీ , ఎండీ-హెచ్‌జీసీఎల్‌ చేసిన కృషితో ఔటర్‌ రింగురోడ్డు పచ్చదనంతో కొత్త శోభను సంతరించుకుందని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ సంతోషం వ్యక్తం చేశారు. హరితహారంలో భాగంగా విస్తృతంగా నాటిన మొక్కలతో ప్రస్తుత వర్షాకాలంలో ఔటర్‌ రింగు రోడ్డు పరిసరాలు పచ్చదనానికి నెలవుగా మారాయని, దాంతో వాహన చోదకులు ఆహ్లాదకర వాతావరణంలో గ్రీన్‌ డ్రైవింగ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. ఇన్ని రోజులు నాటిన మొక్కలు ప్రస్తుత వర్షాకాలంలో పచ్చదనాన్ని పంచుతున్నాయని, గ్రీన్‌ డ్రైవింగ్‌-హైదరాబాద్‌ పేరు తెచ్చాయని పేర్కొన్నారు. ఈ మేరకు పచ్చదనంతో కలకలలాడుతున్న ఔటర్‌ రింగురోడ్డు పరిసరాల ఫోటోలను ట్వీట్టర్‌కు ట్యాగ్‌ చేశారు. ఈ ట్వీట్‌ను మంత్రి కేటీ. రామారావు, హరితహారం కార్యక్రమానికి ట్యాగ్‌ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement