Tuesday, November 12, 2024

ప్రధాని ఇలాఖాలో క్రికెట్‌ స్టేడియం.. బీసీసీఐ ఆర్థిక సాయం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో క్రికెట్‌ స్టేడియం నిర్మాణానికి ఉత్తర్‌ప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (యూపీసీఏ) శ్రీకారం చుట్టింది. ఈ స్టేడియం నిర్మాణానికి బీసీసీఐ ఆర్థిక సాయం చేయనున్నది. బీసీసీఐతో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ఈ స్టేడియం నిర్మాణంలో భాగస్వామ్యం కానుంది.

ఇప్పటికే బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా, సెక్రటరీ జై షా వెళ్లి స్థలాన్ని పరిశీలించారు. ఇక ఈ స్టేడియం నిర్మాణానికి రూ.345 కోట్లు ఖర్చవుతుందని అధికారుల అంచనా. ఇందులో సుమారు రూ.90 కోట్ల వరకు బీసీసీఐ ఆర్థిక సాయం చేయనుంది. దాదాపు 35వేల మంది సీటింగ్‌ కెపాసిటీతో ఈ స్టేడియం నిర్మించనున్నట్లు ఉత్తర్‌ప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ వర్గాలు వెల్లడించాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement