Thursday, May 2, 2024

అవినీతి బాగోతం: పంచాయతీ కార్యదర్శీ.. ఇదేం కక్కుర్తి!

గ్రామపంచాయతీల్లో ఉప సర్పంచ్​ పదవులకు ఎసరు పెట్టే కార్యక్రమం జరుగుతోంది. కొత్త పంచాయతీరాజ్​ చట్టం ఇచ్చిన ‘జాయింట్​ చెక్​పవర్​’తో తమకు కొరకరాని కొయ్యలుగా మారిన ఉపసర్పంచులను అడ్డుతొలగించేందుకు అనేకచోట్ల సర్పంచులు పావులు కదుపుతున్నారు. గతంలో సర్పంచ్​కు, పంచాయతీ సెక్రెటరీకి జాయింట్​ చెక్​పవర్​ ఉండేది. కానీ కొత్త​ చట్టం ప్రకారం.. పంచాయతీ సెక్రెటరీకి బదులు ఉపసర్పంచ్​కు చెక్​పవర్​ కట్టబెట్టింది ప్రభుత్వం. దీంతో వందలాది గ్రామాల్లో నిధులు​ ఖర్చు చేసే విషయంలో సర్పంచులకూ, ఉపసర్పంచులకూ మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఆయా చోట్ల  తాము సర్పంచులు, ఆఫీసర్ల అవినీతిని, అక్రమాలను చెక్​ పవర్​తో అడ్డుకుంటున్నామని ఉపసర్పంచులు చెబితే, అన్ని వ్యవహారాల్లో తలదూర్చి గ్రామ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని సర్పంచులు వాదిస్తున్నారు. తాజా సిద్ధిపేట జిల్లాలో కొహెడ మండలం రామచంద్రాపూర్ గ్రామంలో ఉపసర్పంచ్ కొంతం శ్రీకాంత్ ని గ్రామ పంచాయితీ బిల్లులపై సంతకాలు చేయాలంటూ ఒత్తిడి చెస్తున్నారు. లేదంటే ఉపసర్పంచ్ పదవి నుంచి తొలగిస్తానని గ్రామ కార్యదర్శి సావుల సరస్వతి బెదిరింపులకు పాల్పడుతున్నారు. అక్రమ బిల్లులపై డబ్బులు తీసుకొని సంతకాలు చేయాలంటూ ఒత్తిడికి గురిచేస్తున్నారు.

రామచంద్రపూర్ గ్రామంలో ప్రస్తుతం 1600పై గా జనాభా ఉంది. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం నలుగురు మాత్రమే ( MPW) మల్టిపుల్ వర్కర్స్ గా అవకాశం ఉంది. ఇందులో అర్హులైన నలుగురిని పాలకవర్గం తీర్మానం చేసి నియమించడం జరిగింది. కానీ నిబంధనలు ఉల్లంఘించి పంచాయతీ రాజ్ రూల్స్ కి వ్యతిరేకంగా ముగ్గురు పని వారికి మాత్రమే జీతాలు ఇస్తూ.. నాలుగో వ్యక్తి జీతాన్ని మాత్రం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. విధులకు హాజరైన కూడా,  హాజరు వేయకుండా గ్రామ కార్యదర్శి ఇబ్బందులకు, భ్రయబ్రాంతులకి గురి చేస్తుంది. అయితే వీరికి సంబంధించిన చెక్కులపై నలుగురికి ఒకే సారి మంజూరు చేస్తేనే చేక్కులపై సంతకం చేస్తానని ఉప సర్పంచ్ శ్రీకాంత్ పంచాయతీ కార్యదర్శికి స్పష్టం చేశారు.

ప్రకృతి వనానికి సంబంధించిన బిల్లులపై ఎలాంటి అభ్యంతరం తెలుపకుండ సంతకం పెట్టినట్లయితే నీకు కావాల్సినంత కమిషన్, లంచంగా ఇప్పిస్తానని ఈ విషయం మూడో వ్యక్తికి కూడా తెలియకుండ పని కానిద్దాం  అంటూ ఉపసర్పంచ్ పై కార్యదర్శి ఒత్తిడికి గురిచేశారు. దీనిపై ఉప సర్పంచ్ కొంతం శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేస్తూ ‘’నేను ప్రజల నుండి ఎన్నికైన ప్రజా ప్రతినిధిని నా ముందే ప్రజాధనం దుర్వినియోగానికి గురైతే సహించలేను ’’ అని స్పష్టం చేశారు. తనను అవినీతి బిల్లులపై సంతకం చేయాలని లేకపోతే  చెక్ పవర్ తొలగించి, ఉపసర్పంచ్ పదవి నుంచి తొలగిస్తానని బెదిరింపులకు పాల్పడినట్లు ఉపసర్పంచ్ శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. లంచం ఆశ చూపిన ఈ కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఇది ఇలా ఉంటే.. పంచాయతీ అంటే సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులతో పాటు పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వం తరపున ప్రధాన పరిపాలనా ఉద్యోగిగా ఉంటారు. పరిపాలనాపరమైన నిర్ణయాలను తీసుకునే అధికారం సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులది కాగా, ఆ నిర్ణయాలను అమలు చేసే బాధ్యత మాత్రం కార్యదర్శిది. పంచాయతీ పాలకవర్గాలు ఎన్నికై ఈ ఏడాది ఫిబ్రవరికి రెండేళ్లు పూర్తయ్యాయి.  రెండేళ్ల దాకా ఉపసర్పంచులను తొలగించే అవకాశం లేకపోవడం, ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టే చాన్స్​ రావడంతో ఇదే అదునుగా తమకు సహకరించని ఉపసర్పంచులను వదిలించుకునేందుకు అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement