Monday, April 29, 2024

చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణను కలిసిన గోరటి వెంకన్న.. తన రచనలను అభినందించిన చీఫ్‌ జస్టిస్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణను ప్రముఖ కవి, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న కలిశారు. శుక్రవారం సాయంత్రం గోరెటి వెంకన్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకోనున్నారు. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణను వెంకన్న మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించిన గోరెటి వెంకన్నను ఎన్వీ రమణ అభినందించి, శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా సీజేఐకి వెంకన్న వల్లంకి తాళం కవితా సంపుటిని బహూకరించారు. ఎన్వీ రమణ అభ్యర్థన మేరకు వెంకన్న అడవి తల్లిపై పాటను పాడి వినిపించారు. ఈ సం దర్భంగా చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ మాట్లాడుతూ… ప్రకృతితో మానవుని జీవితం పెనవేసుకున్న తీరును గోరటి చాలా చక్కగా వల్లంకితాళం పుస్తకంలో అభివర్ణించారని కొనియాడారు. ప్రకృతిలోని అన్ని అంశాలు మనిషిపై సానుకూల ప్రభావం చూపిస్తాయో వివరించారని అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement