Friday, May 17, 2024

తగ్గిన బంగారం ధరలు..పెరిగిన వెండి

నేటి బంగారం..వెండి ధరలు ఇలా ఉన్నాయి. వరుసగా 4 రోజులుగా బంగారం ధరల్లో తగ్గుదలే కనిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.50 మేర తగ్గి.. రూ. 46 వేల 550కి పడిపోయింది. అంతకుముందు రోజు ఇది 46 వేల 600 రూపాయల వద్ద ఉండేది. ఇక 24 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర హైదరాబాద్‌లో రూ.60 పడిపోయి 50 వేల 780 రూపాయలకు చేరింది. ఇక 2 రోజుల పాటు స్థిరంగా ఉన్న వెండి ధరలు మళ్లీ పెరిగాయి. ఒక్కరోజే రికార్డు స్థాయిలో 2 వేల మేర పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2000 పెరిగి రూ.65 వేలకు చేరింది. అంతకుముందు రోజు రూ.63 వేల వద్ద ఉంది. అయితే.. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే.. మరోసారి డాలర్ పుంజుకొని బంగారం రేట్లు మళ్లీ భారీగా దిగివస్తాయి. కాబట్టి.. ప్రస్తుతం ఉన్న ధరలు ఇంకా తగ్గే అవకాశాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement