Friday, May 3, 2024

త‌గ్గిన బంగారం..వెండి ధ‌ర‌లు

నేడు బంగారం..వెండి ధ‌ర‌లు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి. కాగా హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.330 తగ్గి రూ.46,400గా నమోదైంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.360 తగ్గి రూ.50,620గా ఉంది. సిల్వర్ రేట్లు సైతం నేడు నేలచూపులు చూస్తున్నాయి. కేజీ వెండి రేటు రూ.600 తగ్గి రూ.61,800గా నమోదైంది. ఢిల్లీలో కూడా బంగారం, వెండి ధరలు తగ్గిపోయాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీలో రూ.330 తగ్గి రూ.46,550గా నమోదైంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.360 తగ్గి రూ.50,780గా ఉంది. సిల్వర్ రేట్లు ఢిల్లీలో రూ.600 మేర దిగొచ్చాయి. దీంతో కేజీ సిల్వర్ రేటు ఢిల్లీలో రూ.56,400గా ఉంది. విజయవాడలో కూడా ఇదే రకమైన ట్రెండ్ కనిపిస్తోంది. బంగారం, వెండి ధరలు ఈ విధంగానే తగ్గిపోయాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర విజయవాడలో కూడా రూ.330 తగ్గడంతో ఈ రేటు రూ.46,400గా, 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.360 తగ్గడంతో ఈ రేటు రూ.50,620గా నమోదయ్యాయి. వెండి రేట్లు విజయవాడలో రూ.600 తగ్గి రూ.61,800గా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement