Monday, April 29, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో బంగారం ధర ఇవాళ స్థిరంగా ఉంది. క్రితం సెషన్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.260 పెరిగగా ఇవాళ ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం తులం రేటు రూ.56 వేల 250 పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 61 వేల 360 వద్ద కొనసాగుతోంది. ఇక దేశ రాజధాని హస్తినాలో చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం రేటు ఇవాళ రూ. 56 వేల 400 పలుకుతోంది. మరోవైపు.. 24 క్యారెట్ల బంగారం ధర ఇవాళ 10 గ్రాములకు ఢిల్లీలో రూ. 61 వేల 510 వద్ద ట్రేడవుతోంది. వెండి విషయానికి వస్తే బంగారం దారిలోనే ఇవాళ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి రేటు ప్రస్తుతం రూ. 77 వేల 500 మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.74 వేల 50 వద్ద స్థిరంగా ఉంది. ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో వెండి రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. అలాగే బంగారం రేటు మాత్రం కాస్త తక్కువగా ఉంటుంది. అందుకు స్థానికంగా ఉండే ట్యాక్సులు, ఇతర అంశాలు కారణం.

Advertisement

తాజా వార్తలు

Advertisement