Friday, May 17, 2024

ఈ నెల‌లో 2,300వ‌ర‌కు త‌గ్గిన బంగారం ధ‌ర‌లు-నిల‌క‌డ‌గా వెండి

ఈ నెల లో బంగారం ధ‌ర రూ.2,300వ‌ర‌కు త‌గ్గింది. బంగారం ధర ఈ నెల ఆరంభంలో 10 గ్రాముల 24 క్యారెట్లకు రూ. 51 వేల వద్ద ఉండేది. అదే సమయంలో 22 క్యారెట్ల పసిడి రేటు విషయానికి వస్తే.. ఈ గోల్డ్ రేటు పది గ్రాములకు రూ. 46,750 వద్ద ఉంది. అయితే తర్వాత జూలై 5న 24 క్యారెట్ల బంగారం రేటు రూ. 52,470కు చేరింది. అటుపైన పసిడి రేటు పడిపోతూ వచ్చింది. 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 50,180 స్థాయికి కూడా క్షీణించింది. అలాగే ఆర్నమెంటల్ గోల్డ్ అయిన 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 46 వేలకు దిగి వచ్చింది.

అంటే ఈ నెల గరిష్ట స్థాయి నుంచి చూస్తే 24 క్యారెట్ల పసిడి రేటు ఏకంగా రూ. 2,300 వరకు పతనమైంది. అదే నెల ఆరంభం నుంచి చూస్తే బంగారం రేటు దాదాపు రూ. 900 దిగి వచ్చింది. దేశీ మార్కెట్‌లో జూలై 26న బంగారం ధరలు స్థిరంగానే కొనసాగాయి. పసిడి రేటులో ఎలాంటి మార్పు లేదు. వెండి ధర కూడా నిలకడగానే కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 51,160 వద్ద నిలకడగా ఉంది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 46,900 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. బంగారం ధరలు స్థిరంగా ఉంటూ రావడం ఇది వరుసగా రెండో రోజు కావడం గమనార్హం. అలాగే వెండి రేటు ఈరోజు రూ.100 మేర తగ్గింది. సిల్వర్ రేటు కేజీకి రూ. 61,100 వద్ద ఉంది.వెండి రేటు నెల ఆరంభంలో కేజీకి రూ. 65,300 వద్ద ఉండేది. అయితే తర్వాత ఈ సిల్వర్ రూ. 60,400 స్థాయికి కూడా క్షీణించింది. అంటే వెండి ధర ఏకంగా రూ. 5 వేలు దిగి వచ్చిందని చెప్పుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement