Tuesday, April 30, 2024

నేటి బంగారం ధ‌ర‌లు కాస్త త‌గ్గాయి-పెరిగిన వెండి

నేటి బంగారం ధ‌ర‌లు కాస్త త‌గ్గాయి. కాగా వెండి ధ‌ర పెరిగింది. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్‌లో రూ.46 వేల కిందకి దిగొచ్చింది. నేడు ఈ రేటు రూ.400 మేర తగ్గడంతో.. 22 క్యారెట్ల ధర రూ.45,800గా నమోదైంది. అలాగే 24 క్యారెట్ల ధర రూ.50 వేల కిందకి పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్లో ఈ రేటు రూ.440 మేర తగ్గడంతో.. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.49,960గా నమోదైంది. వరుసగా నాలుగు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూనే ఉన్నాయి. ఈ 4 రోజుల్లో 22 క్యారెట్ల ధరపై రూ.950 మేర, 24 క్యారెట్ల ధరపై రూ.1040 పైన బంగారం ధర తగ్గిపోయింది. బంగారం ధరలు భారీగా పతనమవుతోన్న ఈ సమయంలో.. వెండి రేటు మాత్రం హైదరాబాద్ మార్కెట్లో అనూహ్యంగా పెరిగింది. కేజీ వెండి రేటు రూ.500 పెరిగి రూ.61,600గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో బంగారం, వెండి ధరలు రెండూ కిందకి పడిపోయాయి. అక్కడ 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.400 తగ్గడంతో ఈ రేటు రూ.45,950గా రికార్డయింది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.440 తగ్గడంతో రూ.50,120గా నమోదైంది. ఢిల్లీలో సిల్వర్ రేటు కూడా కిందకి దిగొచ్చింది. కేజీ వెండి ధర ఢిల్లీలో రూ.600 తగ్గి రూ.56,400గా నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement