Sunday, April 28, 2024

నేటి బంగారం ధ‌ర‌లు- పెరిగిన వెండి

నేడు బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన బంగారం ధరల 350 రూపాయల మేర పెరిగి రూ. 46,850కి చేరింది. అంతకుముందు రోజు ఇది రూ. 46,500గా ఉంది. ఇదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 పెరిగింది. రూ. 50 వేల 730 నుంచి 51 వేల 110 రూపాయలకు పెరిగింది. గత 10 రోజుల్లో చూసుకుంటే బంగారం ధర ఏకంగా 850 మేర పెరిగింది. కాబట్టి రానున్న పండగ సీజన్‌లో మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పుడే కొనేందుకు ఒకసారి ఆలోచించండి మరి. గత కొద్దిరోజుల పరంగా చూసుకుంటే హైదరాబాద్‌లో సెప్టెంబర్ 5వ తేదీన 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర అత్యధికంగా రూ.

46,900 పలికింది. సెప్టెంబర్ 16న కనిష్టంగా రూ. 45,800కు కూడా పడిపోయింది. ఢిల్లీలో మాత్రం బంగారం ధర హైదరాబాద్‌తో పోలిస్తే కాస్త ఎక్కువే ఉంది. 10 గ్రాముల పుత్తడి ధర దేశరాజధానిలో రూ. 47 వేలు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం అయితే.. ఇక రూ. 51,280 వద్ద ఉంది. విజయవాడలో కూడా బంగారం ధరలు హైదరాబాద్ మాదిరే ఉన్నాయి. అక్కడ 22 క్యారెట్లకు చెందిన తులం పసిడి రూ. 350 మేర పెరిగి రూ.46,850కి చేరింది. చెన్నైలో ఈ ధర కాస్త ఎక్కువగానే ఉంది. అక్కడ ఏకంగా రూ. 47,050గా ఉండటం విశేషం. పెళ్లిళ్లు, పండగలు, ఇతర ప్రత్యేక సమయాల్లో గోల్డ్‌కు మంచి డిమాండ్ ఉంటుంది.సిల్వర్ ధరలు కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో కేజీకి ఏకంగా రూ. 500 మేర పెరిగింది. రూ. 62 వేల నుంచి 62 వేల 500కు చేరింది. గత 10 రోజుల్లో 1000 మేర పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement