Thursday, May 2, 2024

పెరిగిన బంగారం ధరలు.. పసిడి బాటలో వెండి

నేడు బంగారం..వెండి ధ‌ర‌లు ఎలా ఉన్నాయో చూద్దాంద‌.. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.49,450 వద్ద స్థిరంగా ఉంది. అంతకుముందు వరుసగా 3 రోజుల్లో రూ.900 మేర పెరిగింది. అయితే నవంబర్ 4న 22 క్యారెట్ల బంగారం రేటు తులానికి రూ.46,100 వద్ద ఉండేది. దీంతో ఒక్క నెల వ్యవధిలోనే పసిడికి రెక్కలొచ్చాయి. ఈ సమయంలో ఏకంగా రూ.3,350 మేర గోల్డ్ రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇక 24 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర హైదరాబాద్‌లో రూ.53,950కి చేరింది.

విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.49,450 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 53,950 వద్ద స్థిరంగా ఉన్నాయి. దిల్లీలో కూడా బంగారం ధరలో పెద్దగా మార్పు లేదు. దేశ రాజధానిలో ప్రస్తుతం తులం గోల్డ్ రేటు 22 క్యారెట్లకు రూ.49,600 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేటు రూ. 54,100 అధిగమించింది. ఇక వెండి రేటు విషయానికి వస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.71,600 వద్ద స్థిరంగా ఉంది. 10 రోజుల వ్యవధిలో ఏకంగా రూ.3 వేలకుపైన, నెల వ్యవధిలో ఏకంగా 7 వేల రూపాయలకుపైగా వెండి రేటు పెరగడం గమనార్హం. నవంబర్ 3న కిలో వెండి రేటు హైదరాబాద్‌లో రూ.64 వేల వద్ద ఉంది. హైదరాబాద్‌తో పోలిస్తే వెండి ధర దేశ రాజధాని దిల్లీలో తక్కువకే లభిస్తుంది. ప్రస్తుతం అక్కడ కిలో వెండి రేటు రూ.65,200 వద్ద ఉంది. అంటే రూ.6 వేల మేర వ్యత్యాసం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement