Sunday, May 5, 2024

ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు (ఆడియోతో…)

గరుడ పురాణంలోని ఋషిప్రబోధము పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

యస్యనాస్తి స్యయం ప్రజ్ఞా కేవలంతు బహుశ్రుత:
నస జానాతి శాస్త్రార్థం దర్వీ సూపరసానివ

తనక ంటూ ప్రజ్ఞ అనగా ప్రతిభ లేని వాడు ఎన్ని శాస్త్రములను విన్నను, చదివిననూ గరిట పక్వాన్నాలలోని రుచిని తెలియనట్టు శాస్త్రార్థములను తెలియజాలడు. తనకంటూ ప్రతిభ ఉన్నవాడు దాన్ని తన ప్రజ్ఞ తో మరి కాస్త విస్తరించుకుంటాడ ని గరుడపురాణం చెబుతుంది.

ఆచార్యాత్‌ పాదమాదత్తే పాదం శిష్య: స్వమేధయా

శిష్యుడు గురువు నుండి నాల్గవ భాగాన్ని స్వీకరిస్తాడు. ఇంకొక నాల్గవ భాగాన్ని తన ప్రజ్ఞతో స్వీకరిస్తాడు అని భావం. మరి ఆ ప్రజ్ఞ లేనివాడు విన్న దాన్నే గుర్తించుకోలేక అందులోని సారాన్ని గ్రహించజాలడు. నాలుక లేని గరిట ఎన్ని పిండి వంటలలో కలిసినా పెద్దగా తేడా లేనట్టు ప్రజ్ఞ లేనివాడు ఎన్ని శాస్త్రాలు చదివినా ఫలితం లేదని తాత్పర్యం.

- Advertisement -

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement