Thursday, May 2, 2024

నాలుగు రోజుల్లో వెయ్యి రూపాయ‌లు పెరిగిన బంగారం.. ప‌సిడి బాటలోనే వెండి

గ‌త కొన్ని రోజులుగా బంగారంద‌..వెండి ధ‌ర‌లు పెరుగుతూ వ‌స్తున్నాయి.. సిల్వర్ మాత్రం రికార్డు స్థాయికి చేరడం గమనార్హం. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.200 మేర పెరిగి.. రూ.49,450కి చేరింది. వరుసగా నాలుగు రోజుల్లో గోల్డ్ రేటు ఏకంగా రూ. 1000 మేర పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గత 10 రోజుల్లో చూసినా ఒక్కరోజు మాత్రమే పసిడి ధరలు పడిపోయాయి. ఇక 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే ప్రస్తుతం హైదరాబాద్‌లో రూ.220 మేర పెరిగి.. 10 గ్రాముల గోల్డ్ రేటు 53,950కి చేరింది.ఇక సిల్వర్ గురించి వేరే చెప్పనక్కర్లేదు.

బంగారానికి మించి దూసుకెళ్తోంది. వరుసగా 3 రోజుల్లోనే ఏకంగా రూ.3600 మేర రేటు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.600 మేర పెరిగి రూ.71,600కు చేరింది. 10-15 రోజుల కిందట సిల్వర్ రేటు రూ.63 వేల లెవెల్స్‌లో ట్రేడవడం గమనార్హం. అయితే దిల్లీలో మాత్రం వెండి రేటు కాస్త తక్కువగానే ఉంటుంది. దేశ రాజధానిలో కిలో సిల్వర్ రూ.900 పెరిగి రూ.65,200కు చేరింది. అయితే బంగారం, వెండి ధరలు ప్రాంతాలను బట్టి హెచ్చుతగ్గులకు గురవుతుంటాయి. అక్కడి పన్నులు రేట్లను ప్రభావితం చేస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement