Monday, May 6, 2024

నేటి బంగారం ధ‌రలు-త‌గ్గిన వెండి

నేటి బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్‌ మార్కెట్లో నేడు 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.200 తగ్గి రూ.46,200కు చేరుకుంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.220 తగ్గి రూ.50,400కు పడిపోయింది. సిల్వర్ రేటు సైతం హైదరాబాద్‌లో రూ.700 తగ్గి రూ.61,100కు చేరుకుంది. దేశ రాజధాని డిల్లీలో కూడా బంగారం ధరలు పడిపోయాయి. అక్కడ కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.200 తగ్గి రూ.46,350కి, 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.220 తగ్గి రూ.50,560కి చేరుకున్నాయి. అయితే అనూహ్యంగా ఢిల్లీలో వెండి ధరలు బలపడ్డాయి. కేజీపై ఏకంగా రూ.600 మేర ధర పెరగడంతో ఈ రేటు రూ.57 వేలకు చేరుకుంది. గ్లోబల్ మార్కెట్లలో కూాడా పసిడి వన్నె తగ్గింది. ఔన్స్ తన కీలకమైన 1,700 డాలర్ల స్థాయి నుంచి 0.3 శాతం కిందకి పడింది. అలాగే సిల్వర్ సైతం ఔన్స్ 0.6 శాతం పడిపోయి 19.57 డాలర్లుగా రికార్డయింది. వచ్చే వారం ఫెడరల్ రిజర్వు నిర్వహించబోయే మీటింగ్‌పైనే ఇన్వెస్టర్లు ఫోకస్ చేశారు. ఈ మీటింగ్‌లో వడ్డీ రేట్ల పెంపు 75 బేసిస్ పాయింట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. అంతేకాక ప్రపంచంలో బంగారానికి అతిపెద్ద వినియోగదారి అయిన చైనాలో ఆర్థిక మందగమనం కూడా బంగారం జ్యూవెల్లరీ కొనుగోళ్లపై ప్రభావం చూపుతుంది. అందువల్ల బంగారం ధరలు దిగొస్తున్నా.. ఇన్వెస్టర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదని నిపుణులంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement