Tuesday, May 7, 2024

నేటి బంగారం ధ‌ర‌లు-నేల చూపులు చూసిన సిల్వ‌ర్

నేటి బంగారం ధ‌ర‌లు కాస్త ఊర‌ట‌నిచ్చాయి. జూన్ 30న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 980 క్షీణించింది. దీంతో పసిడి రేటు రూ. 51 వేలకు తగ్గింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధరను గమనిస్తే.. పది గ్రాములకు రూ. 900 క్షీణించింది. దీంతో ఈ గోల్డ్ రేటు రూ. 46,750కు తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో ఈ రేట్లు వర్తిస్తాయి. కాగా బంగారం ధరలు నిన్న స్థిరంగానే కొనసాగిన విషయం తెలిసిందే. అమెరికా డాలర్ బలపడటంతో పసిడిపై ప్రభావం పడిందని నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం దారిలోనే వెండి రేటు కూడా పయనించింది. సిల్వర్ రేటు ఈ రోజు నేల చూపులు చూసింది. కేజీ వెండి ధర రూ. 300 తగ్గింది. దీంతో సిల్వర్ రేటు రూ. 65,300కు పడిపోయింది. వెండి ధర నిన్న కూడా క్షీణించింది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే సిల్వర్ రేటు రూ. 700 తగ్గిందని చెప్పుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement