Monday, April 29, 2024

Gold Price: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధర

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్. బంగారంధర ఈరోజు కూడా పెరిగింది. అయితే, వెండి దర మాత్రం నిలకడగానే కొనసాగింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.140 పెరిగింది. దీంతో బంగారం ధర రూ.49,360కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.130 పెరుగుదలతో రూ.45,250కు ఎగసింది. బంగారం ధర పెరిగితే.. వెండి రేటు మాత్రం స్థిరంగా ఉంది. వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి ధర రూ.65,300 వద్ద కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement