Thursday, May 9, 2024

Gold Rate: పసిడి ప్రేమికులకు షాక్.. రూ.52 వేలు దాటిన బంగారం ధర

బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. బంగారం ధర భారీగా పెరిగింది. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1090 మేర పెరిగింది. దీంతో పసిడి రేటు రూ. 52,040కు ఎగసింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1000 పెరుగుదలతో రూ. 47,700కు చేరింది. బంగారం ధరలు పెరిగితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడించింది. వెండి ధర రూ.2100 పెరుగుదలతో రూ. 72,100కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement