Wednesday, May 15, 2024

Gold Rate: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్. గత మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు ఈరోజు ఒక్కసారిగా పెరిగాయి. 10 గ్రాముల బంగారంపై రూ. 720 పెరగగా.. కిలో వెండిపై రూ.900 వరకు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.720 పెరిగి రూ. 51,280కు ఎగసింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,000కు చేరింది. వెండి రేటు కూడా బంగారం దారిలోనే నడిచింది. వెండి రేటు రూ.900 పెరుగుదలతో రూ. 69,900కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement