Tuesday, May 7, 2024

Gold Price: పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం, వెండి ధరలు..

బంగారం, వెండి కొనాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్.  నిన్న నిలకడగా కొనసాగిన పసిడి రేటు ఈరోజు మాత్రం పెరిగింది. వెండి ధర కూడా పసిడి దారిలోనే పయనించింది. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగింది. దీంతో పసిడి రేటు రూ.51,700కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరుగుదలతో రూ. 47,400కు పెరిగింది. బంగారం ధరలు పైకి జిగేలు మంటే.. వెండి రేటు రూ.300 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 72,600కు ఎగసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement