Saturday, May 4, 2024

Good News: నేడు అక్షయ తృతీయ.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం కొనుగోళ్లు చేయాలని భావించే వారికి శుభ వార్త. నేడు అక్షయ తృతీయ పర్వదినం. అత్యంత పవిత్రమైన రోజుగా అక్షయ తృతీయను భావిస్తారు. అయితే, అక్షయ తృతీయ రోజు బంగారం ధరలు భారీగా పడిపోయాయి. మంగళవారం హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం రేటు వెయ్యి రూపాయల పైన తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,190 తగ్గింది. దీంతో పసిడి రేటు రూ.47,200కు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,280 మేర తగ్గింది. దీంతో బంగారం ధర రూ.51,510కి క్షిణించింది. ఇక, వెండి ధర కూడా బంగారం దారిలోనే నడిచింది. వెండి ధర రూ.2 వేల మేర తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.67,600కి చేరింది. అక్షయ తృతీయ నాడే బంగారం ధర తగ్గడంతో  ఈ రోజు భారీగా కొనుగోళ్లు జరిగే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement