Sunday, May 5, 2024

జూన్ 5 నుంచి రెండో విడ‌త గొర్రెల పంపిణీ…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా యాదవ, కురుమల సోదరులకు రాష్ట్రంలోని గొల్ల, కురుమలకు తెలంగాణ ప్రభు త్వం శుభవార్త చెప్పింది. జూన్‌ 5వ తేదీ నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ కార్య క్రమాన్ని చేపట్టనున్నట్లు రాష్ట్ర పశుగణాభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. తెలంగాణ రాష్ట్రా వతరణ దశాబ్ది ఉత్స వాల్లో భాగంగా గొర్రెల పంపిణీ చేపట్టాలని ఆదేశించారు. జూన్‌ 5న నల్గొండలో అధికారికంగా ప్రారంభిస్తామని మంత్రి శ్రీనివాస యాదవ్‌ తెలిపారు. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. గొర్రెల పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, పశుసంవర్థకశాఖ అధికారులను ఆదేశించారు.

మొదటి విడ తలో 3.93 లక్షల మందికి రూ.5 వేల కోట్లతో 84లక్షల గొర్రెలు పంపిణీ చేసింది. ఇక రెండో విడతలో 3లక్షలా 50వేల మందికి రూ.6,500 కోట్లతో 75 లక్షల గొర్రెలు పంపిణీ చేయాలని తాజాగా నిర్ణయించింది. పెరిగిన ధరలకు అనుగుణంగా గొర్రెల యూనిట్‌ ధరను రూ.1.75 లక్షలకు పెంచింది. ఇందులో లబ్ధిదారు రూ.43,750లు తన వాటాగా చెల్లించాలి. మిగిలిన రూ.లక్షా 31,250ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. రెండో విడత గొర్రెల పంపిణీ పథకానికి ఈఏడాది మార్చి 9న రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు 72,612 మంది నుంచి డీడీలు సేకరించారు.

చివరి లబ్ధిదారుడి వరకు గొర్రెలు పంపిణీ
జూన్‌ 5 నుంచి ఆదేశించినందుకు యాదవ, కురుమ సోదరుల సీఎం కేసీ ఆర్‌ కు ధన్యవాదాలు. పారదర్శకంగా ఎవరైతే చివరి లబ్ధిదారుల వరకు గొర్రెల పంపి ణీ చేస్తాం. లబ్ధిదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సీఎం కేసీ ఆర్‌ నాయకత్వంలో మంత్రి తలసాని మార్గనిర్దేశనంతో పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.
దూదిమెట్ల బాలరాజు యాదవ్‌, రాష్ట్ర గొర్ల కాపరుల అభివృద్ధి కార్పోరేషన్‌ చైర్మన్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement