Wednesday, May 1, 2024

ద‌స‌రాకి తెలుగుదేశం మ‌హా మేనిఫెస్టో విడుద‌ల …

అమరావతి, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోకు మూహూర్తం ఖరారైం ది. ఈ ఏడాది విజయదశమి (దసరా) నాడు మేనిఫెస్టోను విడుదల చేసేందుకు ఆ పార్టీ సన్నాహాలు చేస్తుంది. ముందస్తు ఎన్నికలు వచ్చినా ఎటువం టి ఇబ్బంది లేకుండా మేనిఫెస్టో రూపకల్పనకు తెదేపా ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఈ మేని ఫెస్టో 2024 ఎన్నికలకు అత్యంత కీలకంగా మార నుంది. తెలుగుదేశం పార్టీ వివిధ వర్గాలను తన పక్షానికి తిప్పుకునేందుకు మేనిఫెస్టోను ఆ దిశగా రూపొందిస్తుంది. ముఖ్యంగా పేదల సంక్షేమంతో పాటు రైతులు, యువతను ప్రామాణికంగా తీసు కుని మేనిఫెస్టో రూపకల్పన చేస్తున్నారు. ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాల్లో లోటుపాట్లను పూర్తిగా అధ్యయనం చేస్తున్న తెలుగుదేశం పార్టీ వాటిని మరింత మెరుగ్గా ప్రజలకు అందించాలని భావిస్తున్నారు.

ఇప్పటికే సంక్షేమానికి సంబంధిం చి టీడీపీ అధినేత చంద్ర బాబు స్పష్టమైన ప్రకటన చేశారు. అధికారపక్షం చేస్తున్న ప్రచారాన్ని బలం గా తిప్పికొడుతూ రెట్టింపు సంక్షేమ హామీని ఇసు ్తన్నారు. ఈ క్రమంలో తాజాగా రూపొందించే మేనిఫెస్టో ఆ దిశగానే ఉంటుందన్న అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది. ప్రధానంగా ఈ ఎన్నికల్లో యువత, రైతులను లక్ష్యంగా చేసుకుని తెలుగు దేశం పార్టీ ముందుకు వెళ్తుంది. రైతుల కోసం వివిధ రూపాల్లో పోరాటాలు చేస్తూ వారి మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇంకోవైపు కీలకం గా భావిస్తున్న యువతకు మేనిఫెస్టోలో పెద్దపీట వేయనున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఎన్నిక లకు ముందు నిరుద్యోగ భృతిని చెల్లించింది. ఇప్పుడు యువతకు ఈ పథకాన్ని ఇంకా మెరుగ్గా అందించడంతోపాటు పూర్తిస్థాయిలో అవకాశా లు నైపుణ్య శిక్షణ ఇవ్వాలన్న ఆలోచనలో ఉంది. ఇక పేద వర్గాల అభ్యున్నతిని ఆకాంక్షిస్తున్న టీడీపీ అధినేత దీనికోసం ప్రత్యేక ప్రణాళికను రూపొం దిస్తున్నారు.

మేనిఫెస్టోలో పేదల జీవన ప్రమా ణాలు పూర్తిస్థాయిలో మెరుగు అయ్యేలా ఆర్థిక స్వావలంబన లభించేలా పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే మహిళా లోకానికి కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. డ్వాక్రా మహిళలకు ఆర్థిక సాయంతోపాటు ఇతర రుణ సదుపాయాలను ప్రభుత్వం తరపున అందించే చేయూతను మేనిఫెస్టోలో చూపించనున్నారు. సామాజిక భద్రత పింఛన్ల అంశంలో కూడా తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకునే అవ కాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వృద్ధులు, వితం తువులు, వికలాంగుల పింఛనల్లో భారీ మార్పు లు చేసే దిశగా ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ రూపొందిస్తున్న ఎన్నికల మేనిఫెస్టో అత్యంత కీలకంగా ఉంటుందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది.

ప్రధానంగా అధికార వైకాపా ప్రస్తుతం అందిస్తున్న సంక్షేమ పథకాలకు ధీటుగా కార్యక్రమాలు, పథకాలు ఉండేలా ప్రణా ళికలు సిద్ధం చేస్తున్నారు. మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు. ఈనెల 27,28 తేదీల్లో రాజమండ్రి వేదికగా ఈ ప్రకటన అనంతరం ఎన్నికల కార్యాచరణను తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయిలో ప్రారంభించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement