Monday, April 29, 2024

Hyd : హైద‌రాబాద్ లో న‌కిలీ ఐపీఎస్ అరెస్ట్

నకిలీ ఐపీఎస్ అధికారి రామ్ ను ఈరోజు సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ, తెలంగాణ‌లో ప‌లువురికి ఉద్యోగాలు, కేంద్ర ప్ర‌భుత్వంలో ప‌ద‌వుల పేరుతో సెటిల్మెంట్లు, తక్కువ ధరకు జాగ్వ‌ర్ కార్లు ఇప్పిస్తామని చెప్పి నిందితుడు పలువురిని మోసం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. సెటిల్మెంట్ల కోసం ఫేక్ ఐపీఎస్ అధికారి రామ్ హైద‌రాబాద్ లో ఏకంగా ఆఫీస్ ను ప్రారంభించారు. హైద‌రాబాద్ తో పాటు పలు రాష్ట్రాల్లో ఫేక్ ఆఫీసర్ బాధితులున్నారని పోలీసులు గుర్తించారు. ప్రత్యేక అధికారిగా పోలీస్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నట్టుగా రామ్ బాధితులను నమ్మించాడు.

తుపాకులు, పోలీస్ వాహ‌నాల సైర‌న్లతో బిల్డ‌ప్ ఇచ్చేవాడ‌ని పోలీసులు గుర్తించారు. ఫేక్ ఐపీఎస్ అధికారి రామ్ హైద‌రాబాద్ కు చెందిన మహిళను ట్రాప్ చేసిన విషయం పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. హైద‌రాబాద్ లో తాను ప్రారంభించిన కార్యాలయంలోనే ఫేక్ ఐపీఎస్ అధికారి రామ్ సెటిల్మెంట్లు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఇదే కార్యాలయంలో విచారణ పేరుతో కొందరిని ఫేక్ ఐపీఎస్ అధికారి చిత్రహింసలకు గురిచేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఫేక్ ఐపీఎస్ అధికారి రామ్ ఎవరెవరి నుండి ఎంత మొత్తం డబ్బులు వసూలు చేశారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఫేక్ ఐపీఎస్ అధికారిపై ఇప్ప‌టికే ఆరు కేసున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement