Monday, April 29, 2024

జెమిని ఏషియ‌న్ సినిమాహాల్ లో అగ్నిప్ర‌మాదం .. త‌ప్పిన ముప్పు ..

నేడు హీరో బాల‌కృష్ణ న‌టించిన అఖండ చిత్రం రిలీజ్ అయింది. బాల‌య్య ఫ్యాన్స్ సంబ‌రాల్లో మునిగి తేలుతున్నారు. కాగా వ‌రంగ‌ల్ జెమిని ఏషియ‌న్ సినిమాహాల్ లో అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికి ఎటువంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో ఊపిరిపీల్చుకున్నారు. సినిమా హాల్ లో కూలింగ్ మిషన్ లో పవర్ హీట్ కావడంతో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన థియేటర్ సిబ్బంది మంటలను వెంటనే ఆర్పేశారు. దీంతో ప్రమాదం తప్పింది. ఆ సమయంలో సినిమా హాల్ మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది. బాల కృష్ణ నటించిన అఖండ సినిమా చూస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో థియేటర్ లో 250 మంది సినిమా చూస్తున్నారు. మంటల సమయంలో పొగ నిండిపోవడంతో సినిమా చూస్తున్న వారు బయటకు పరుగులు తీశారు. హఠాత్తుగా జరిగిన సంఘటనతో ప్రేక్షకులు భయాందోళనకు గురయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement