Friday, May 3, 2024

గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ హిట్ లిస్ట్ లో – ద‌ర్శ‌క‌..నిర్మాత క‌ర‌ణ్ జోహార్

బాలీవుడ్ ద‌ర్శ‌క‌..నిర్మాత క‌ర‌ణ్ జోహార్ కూడా గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ హిట్ లిస్టులో ఉన్నాడ‌ట‌. బాలీవుడ్ ఫిలింమేకర్ కరణ్ జోహార్ కూడా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్టులో ఉన్నాడట. కరణ్ జోహార్ ను బెదిరించి డబ్బు గుంజాలన్నది తమ ప్రయత్నమని సిద్ధేశ్ కాంబ్లే వెల్లడించాడు. చంపేస్తామని బెదిరించడం ద్వారా కరణ్ జోహార్ నుంచి రూ.5 కోట్లు వసూలు చేసేందుకు ప్లాన్ వేసినట్టు తెలిపాడు. ఈ గ్యాంగ్ స్టర్ మాటలు నమ్మశక్యంగా లేవని ఓ పోలీసు అధికారి అభిప్రాయపడ్డారు. కరణ్ జోహార్ పేరు ఉపయోగించుకుని ఏదో గొప్పలు చెప్పుకుంటున్నట్టుగా సందేహం కలుగుతోందన్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ గతంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను హత్య చేసేందుకు కూడా ప్లాన్ చేయడం తెలిసిందే. ఇటీవల పంజాబి సింగ‌ర్ సిద్ధూ మూసేవాలా హత్య నేపథ్యంలో, సల్మాన్ ఖాన్ కు భద్రత పెంచిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement