Saturday, April 20, 2024

తమ ఆఫీసుల వద్ద సెక్యూరిటీ గార్డులుగా అగ్నివీర్​లు.. బీజేపీ లీడర్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్​ ఇచ్చిన కేజ్రీవాల్​

బీజేపీ కార్యాలయంలో ‘అగ్నివీర్’లను సెక్యూరిటీ గార్డులుగా పెట్టుకోవడానికి తాను ఇష్టపడతానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. తమ ఉద్యోగ భద్రతపై ‘అగ్నిపథ్’ నిరసనకారుల ఆందోళనలను విజయవర్గీయ చులకనగా తీసుకుంటున్నారని అన్నారు.

కాగా, బీజేపీ లీడర్​ విలేకరులతో మాట్లాడుతూ.. ‘అగ్నివీర్స్’ అని పిలువబడే కొత్త పథకం ‘అగ్నిపథ్’ కింద నాలుగు సంవత్సరాల డ్యూటీ పూర్తి చేసిన యువకులు తమ బీజేపీ ఆఫీసుల వద్ద సెక్యూరిటీ గార్డులుగా మొదటి స్థానంలో ఉంటారని చెప్పారు. బీజేపీ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తామని వ్యాఖ్యానించారు. దీనిపై సీఎం కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ లీడర్ల ఆలోచన, వారి మనస్థత్వం ఎట్లుంటుందో ఆలోచించాలి. సాయుధ దళాలలో చేరడానికి శిక్షణ పొందిన యువకులు సెక్యూరిటీ గార్డు ఉద్యోగాన్ని కోరుకుంటున్నారని బిజెపి లీడర్లు అనడం వారి విజ్ఞతకు వదిలేస్తున్నాం అని విమర్శించారు.

“దేశంలోని యువతను, సైనిక సిబ్బందిని అంతగా అగౌరవపరచవద్దు. దేశంలోని యువత శారీరక పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి, పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి అహోరాత్రులు కష్టపడుతున్నారు.  ఎందుకంటే వారు సైన్యంలో చేరి జీవితాంతం దేశానికి సేవ చేయాలనుకుంటారు. వారు బీజేపీ కార్యాలయం వెలుపల కాపలాగా ఉండాలనుకుంటారు అనుకోవద్దు’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కూడా “సెక్యూరిటీ గార్డ్ వ్యాఖ్య”పై తన పార్టీ లీడర్​ని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. “గొప్ప సైన్యం.. ఎవరి శౌర్యం ప్రపంచమంతటా ప్రతిధ్వనిస్తుంది. రాజకీయ కార్యాలయానికి చౌకీదార్‌గా ఉండమని అనడం ఎంతవరకు సమంజసం. ఇట్లా మాట్లాడిని వ్యక్తికి అభినందనలు. భారత సైన్యం కేవలం భారతమాతకు మాత్రమే సేవా మాధ్యమం అవుతుంది” అని వరుణ్​గాంధీ ట్వీట్ చేశారు.

అగ్నిపథ్​ పై నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్, తెలంగాణ, బీహార్‌లలో అత్యంత తీవ్రంగా పరిస్థితులున్నాయి. నిరసనల మధ్య కేంద్రం పలు రాయితీలను ప్రకటించింది. కోస్ట్ గార్డ్,  డిఫెన్స్ సివిలియన్ పోస్టులు.. మొత్తం 16 డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ లో విస్తరించి ఉన్న రక్షణ మంత్రిత్వ శాఖ ఉద్యోగాలలో 10 శాతం కోటా ఉంటుందని వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం.  

Advertisement

తాజా వార్తలు

Advertisement