Monday, May 6, 2024

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

ఆరు పదుల వయసులోనూ గంగవ్వ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యూట్యూబ్‌లో ‘మై విలేజ్ షో’ ద్వారా పాపులర్ అయిన ఆమె.. బిగ్ బాస్ షోతో మరింత క్రేజ్ సంపాదించుకుంది. తన మార్కు పల్లెటూరి డైలాగులతో అందరినీ ఆకట్టుకుంది. బిగ్ బాస్ షో సభ్యుల మనస్సుల్లోనూ స్థానం సంపాదించింది. అయితే బిగ్‌బాస్‌ హౌజ్‌ వాతావరణం పడకపోవడంతో ఆమె అనారోగ్యం పాలైంది. దాంతో హౌజ్‌నుంచి మధ్యలోనే బయటకు రాక తప్పలేదు. బిగ్‌బాస్‌ హోస్ట్‌ అక్కినేని నాగార్జున చలవతో ఇటీవల సొంతింటి కలను నిజం చేసుకున్న గంగవ్వ తాజాగా హెలికాప్టర్‌లో చక్కర్లు కొడుతున్న వీడియో వైరల్‌గా మారింది. అంతెత్తు ఆకాశం నుంచి తన ఊరు పొలాలను, ఇళ్లను చూసి ఆమె మురిసిపోయింది. శివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడలో హెలికాప్టర్‌ సేవలు మొదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజన్న దర్శనానికి వెళ్లిన గంగవ్వ గాలి మోటార్‌ ఎక్కి పరవశించిపోయింది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement