Wednesday, May 8, 2024

Fun day: రిలీజ్ కు రెడీగా ప్యాన్ ఇండియా మూవీస్.. ఎప్పుడంటే..

డిసెంబర్, జనవరి నెలల్లో ప్రధానంగా రిలీజ్ అయ్యే సినిమా విశేషాలు తెలుసుకుందాం. ఈ రెండు నెలల్లో రాబోతున్న మూవీస్ ఏమిటీ.. అవి ఎప్పుడు థియేటర్లలోకి వస్తున్నాయన్న అంశాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. క్యూలో పెద్ద సినిమాలే ఉన్నాయి.. వీటిలో ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్.. రామ్ చరణ్,  ఎన్టీఆర్ నటిస్తున్న ట్రిపుల్ ఆర్.. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ తో పాటు.. వరుణ్ తేజ్ నటించిన గని కూడా ఉన్నాయి.. ఇట్లాంటి సినీ విషేషాలు చదివి ఎంజాయ్ చేయండి…

  • బ్చాచిలర్.. హీరో జీవీ ప్రకాశ్ అప్ కమింగ్ రొమాన్స్ అండ్ డ్రామా ఫిల్మ్ డిసెంబర్ 3న ఇండియన్ థియేటర్లో రిలీజ్ కానుంది. ఇది కంప్లీట్ గా తమిళ సినిమా..
బ్చాచిలర్ మూవీ పోస్టర్..
  • కాతువాకులా రెండు కాదల్..  విఘ్నేష్ శివన్ డైరెక్షన్లో రాబోతున్న అప్ కమింగ్  రొమాన్స్ అండ్ డ్రామా ఫిల్మ్ ఇది.. దీనికి సంబంధించిన క్యాట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. విజయ్ సేతుపతి, సమంత, నయనతార లీడ్ రోల్ చేస్తున్నారు. డిసెంబర్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. తెలుగు, తమిళంలో మూవీ ఉంటుంది.
kathuvakkula rendu kadhal..
  • గుడ్ లక్ సఖి.. ఇండియన్ థియేటర్స్ లో రానున్న మూవీ ఇది. తొలుత నవంబర్ 26న రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ, డిసెంబర్ 10న రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. అప్పటి కూడా పెద్ద సినిమా వస్తే కనుక మళ్లీ దీని రిలీజ్ డేట్ మారిపోయి.. పోస్ట్ పోన్ అయ్యే చాన్సెస్ ఉన్నట్టు తెలుస్తోంది.
good luck sakhi movie..
  • గంగూబాయి కతివాడి .. సంజయ్ లీలా బన్సాలీ డైరెక్షన్లో రానున్న అప్ కమింగ్ ఫిల్మ్ గంగూబాయి కతివాడి.. అలియాభట్ నటిస్తున్న ఈ సినిమా గురించి అందరికీ తెలిసిందే.. వచ్చే సంవత్సరం జనవరి 6న వస్తుందని ప్రకటించినా.. ఫిబ్రబరి18కి పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి కారణమేంటంటే ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు సమాచారం.
gangubai kathiawadi.. alabhat.. Gangubai Kathiawadi – A story, based on the book “Mafia Queens of Mumbai”.
  • గని..  సాయి మంజ్రేకర్, వరుణ్ తేజ్, నవీన్ చంద్ర  ప్రధానంగా నటిస్తున్న డ్రామా ఓరియంటెడ్ ఫిల్మ్ ఇది. కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి చాలా కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఈ మధ్యనే టీజర్ కూడా రిలీజ్ చేశారు. డిసెంబర్ 24న ఇండియన్ థియేటర్లలో రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది.
Ghani.. Saiee Manjrekar, Varun Tej 
  • బీమ్లా నాయక్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమా పాటలు అదరగొడుతన్నాయి.  జనవరి 12 న్యూ పోస్టర్ రివీల్ తో దీని డేట్  కన్ఫామ్ చేశారు. ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్ పోస్ట్ పోన్ అవుతున్నాయన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కానీ,  వచ్చే సంక్రాంతికి ఈ మూడు సినిమాలతో ప్రేక్షకులు పండుగను మరింత చేయనున్నారు. జనవరి 7 ట్రిపుల్ ఆర్, జనవరి 12న బీమ్లానాయక్, జనవరి 14న రాధేశ్యామ్ రిలీజ్ సినిమాలు కానున్నాయి.
Bheemla Nayak is a ultra action entertainer power star pawan kalyan..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement