Sunday, April 28, 2024

TSRTC: మదర్స్ డే స్పెషల్ ఆఫర్.. అమ్మలకు అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) మదర్స్ డే సందర్భంగా తల్లులందరికీ ప్రత్యేక ఆఫర్‌ను అందజేస్తోంది. మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఆర్టీసీ బస్సుల్లో చంటి పిల్లలతో ప్రయాణించే మహిళల నుంచి టికెట్ వసూలు చేయబోమని ప్రకటించింది. ఐదేళ్లలోపు పిల్లలతో వెళ్లే తల్లులు పూర్తి ఉచితంగా ప్రయాణించవచ్చని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని తల్లులను అభినందించే ఉద్దేశంతోనే ఈ కానుకను అందిస్తున్నట్టు చెప్పారు. ఈ ఆఫర్ ఆదివారం ఒక్క రోజు మాత్రమేనని, చంటిపిల్లల తల్లులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. AC సహా అన్ని బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement