Thursday, May 16, 2024

అంద‌రూ చూస్తుండ‌గా కుప్ప కూలిన భ‌వ‌నం.. త‌ప్పిన ప్రాణ న‌ష్టం

ఓ నాలుగు అంత‌స్థుల భ‌వ‌నం అంద‌రూ చూస్తుండ‌గానే కుప్ప కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ సంఘ‌ట‌న ఉత్తర ఢిల్లీలోని శాస్త్రి నగర్‌ ప్రాంతంలో సోమవారం చేసుకుంది. అయితే అదృష్టవశాత్తూ ఆ ఇళ్లు ఆ సమయంలో ఖాళీగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదు. ఆ భవనం కూలిన ప్రదేశంలో ఓ రోడ్డు ఉంది. ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడ కూడా ఎవరూ లేరు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఇందులో భవనం కుప్పకూలిన తీరు స్పష్టంగా కనిపిస్తోంది. భవనం కూలిన సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక శాఖ, అంబులెన్స్‌లను సంఘటనా స్థలానికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement