Saturday, May 18, 2024

వంద ప‌డ‌క‌ల ఆసుప‌త్రికి శంఖుస్థాప‌న – ఏడాదిలో పూర్తి చేస్తాం – మంత్రి హ‌రీశ్ రావు

పరకాలలో 100 పడకల ఆసుపత్రికి శంఖుస్థాపన చేశారు ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు.ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర రావు, సత్యవతి రాథోడ్, రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపి పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు ధర్మా రెడ్డి, పెద్ధి సుదర్శన్, ఆరూరి రమేష్, వెంకట రమణా రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్, Tsmsidc ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా పరకాలలో 100 పడకల ఆసుపత్రికి శంఖుస్థాపన చేయ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ఏడాదిలో ఆసుపత్రి పూర్తి చేస్తాం. తలసరి ఆదాయ వృద్ధిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్..తెలంగాణ ఏం చేస్తుందో అదే చేయడానికి అన్ని రాష్ట్రాలు చూస్తున్నాయి. ఎవరూ అడగకున్నా రైతుబంధు ఇచ్చాం. దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టింది. రైతు భీమా ఇచ్చిన ఏకైక ప్రభుత్వం. నీటి క‌రువు లేకుండా రైతన్నలకు నీళ్లిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. పైరవీలు లేకుండా రైతు బంధు ఇస్తున్నాం.రైతు మొహంలో ఆనందం, పెదాలపై చిరునవ్వు చూస్తున్నాం.పట్టుబట్టి తెలంగాణకు మిషన్ భగీరథ నీళ్లిచ్చిన ఘనుడు సీఎం కేసీఆర్. ఏటా 5 వేల కోట్లిస్తాం, వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి తెస్తోంది. ప్రాణం పోయినా మీటర్లు పెట్టమని కేంద్రానికి కేసీఆర్ తెగేసి చెప్పారు. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గిరిజన వర్సిటీ దిక్కులేవు. ఉన్నవాటిని అమ్మడానికి బీజేపీ చూస్తోంది. సింగరేణిని ప్రైవేటు పరం చేయాలని చూస్తుంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement