Monday, April 29, 2024

న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండ‌ర్ క్రిస్ కెయిర్న్స్ కి ‘క్యాన్స‌ర్’

న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండ‌ర్ క్రిస్ కెయిర్న్స్ కి క్యాన్స‌ర్ సోకింది. సాధార‌ణ చెక్ అప్ కోసం హాస్ప‌ట‌ల్ కి వెళ్ళ‌గా ఆయ‌న‌కి క్యాన్స‌ర్ అని డాక్ట‌ర్స్ చెప్పార‌ని క్రిస్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు.గత సంవత్సరం ఆగస్టు మాసంలో క్రిస్‌ కెయిర్న్స్‌ కు గుండెపోటు వచ్చింది. ఈ నేపథ్యంలో శస్త్ర చికిత్స నిర్వహించిన సమయంలో.. ఆయన పక్షవాతానికి గురయ్యాడు. వెన్నెముక కూడా బాగా దెబ్బతింది. ఈ నేపథ్యంలోనే చాలా రోజుల పాటు వెంటిలేటర్‌ పై చికిత్స అందించిన అనంతరం కోలుకున్నాడు. అయితే.. తాజాగా క్రిస్‌ కు క్యాన్సర్‌ వ్యాధి సోకింది. దీంతో.. ఆయనకు చికిత్స తీసుకుంటున్నాడు. కాగా.. క్రిస్‌ కెయిర్స్న్‌ 2008 సంవత్సరంలో న్యూజిలాండ్‌ జట్టుకు అలాగే.. అంతర్జాతీయ క్రికెట్‌ కు గుడ్‌ బై చెప్పాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement